అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి మండలం, ఎండపల్లి గ్రామం నందు కొండ చంటి బాబు ఇల్లు భారీ అగ్ని ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టంతో పాటు మూడు కుటుంబాలు రోడ్డున పడిన విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ అవసరాల నిమిత్తం ఒక నెలకు సరిపడా 50 కేజీల బియ్యం మరియు 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మాట్లాడుతూ కొండ చంటిబాబు ఇల్లు భారీ అగ్ని ప్రమాదానికి గురి కావడం చాలా బాధాకరమైన విషయం అని ఈ ప్రమాదం కారణంగా అదృష్టవశాత్తు ప్రాణహాని జరగలేదు గానీ భారీగా ఆస్తి నష్టం జరిగిందని ధాన్యం పండించి అమ్మిన డబ్బులు మూడు లక్షల రూపాయలు ఈ అగ్ని ప్రమాదంలో కాలి బూడిద అయిందని, ఇంట్లో ఏ ఒక్క సామాను మిగలకుండా కాలి బూడిదైన కారణంగా ఇదే ఇంట్లో మూడు కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే ఈ మూడు కుటుంబాలు కొండ చంటి, కొండ ఘన్నియ్య, కొండ రవి, ఇప్పుడు రోడ్డు మీద పడిన పరిస్థితిలో ఈ కుటుంబాలు ఉన్నాయని జనసేన పార్టీ తరఫున ఈ కుటుంబానికి అండగా మేము కొంతమేర ఆర్థిక సహాయం అందించడం జరిగిందని జనసేన నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఇల్లు ఇచ్చామని చెప్పుకోవడం అక్కడ ఇక్కడ ఫోటోలు వేసి ప్రచారం చేసుకోవడం తప్ప సామాన్య ప్రజలకు చేసింది ఏమీ లేదని ఇలాంటి అగ్ని ప్రమాదాల కారణంగా గవర్నమెంట్ యొక్క పనితీరు బయట పడుతుందని డాక్టర్ పిల్లా శ్రీధర్ మండిపడ్డారు. వీలైనంత త్వరగా ఈ కుటుంబానికి ప్రభుత్వం తరఫునుంచి ఆదుకోవాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా మచ్చ అప్పాజీ, మచ్చ శ్రీనివాస్, అనిల్, మత్స్యకార నాయకులు కంబాల దాసు, పల్నాటి మధుబాబు, బండి వాసు బాబు, కంద చక్రబాబు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.