కంబాల దాసుని పరామర్శించిన డా.పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, కోనపాప పేట నందు జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగ నాయకులు కంబాల దాసు సతీమణి ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొన్న పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా పరామర్శించడం జరిగింది. తగిన ఆరోగ్యపరమైన సూచనలను సలహాలను అందించడం జరిగింది. దీనిలో భాగంగా మత్స్యకార నాయకులు పలివెళ్ల బాపన్న దొర, వెంకట్రావు, రాజు, జాన్సన్, నాని, లావరాజు, రాజు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.