గంగిరి తాతారావు కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: ఉప్పాడ కొత్తపల్లి మండలం, ఉప్పాడ గ్రామనికి చెందిన గంగిరి తాతరావు అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి యొక్క కుటుంబాన్ని శనివారం పరామర్శించి మనోధర్యాన్ని అందించడం జరిగింది. అనంతరం వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం బియ్యం బస్తా ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్స్ సర్పంచ్ గరగ సత్యానందరావు, సోదే రవి కిరణ్, పల్లేటి జాన్సన్, పలివెల్ల నాని బాబు, మైలపల్లి రవి, పండు, పెను పోతుల వీరబాబు, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, పిల్లా వీరబాబు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.