పలు కుటుంబాలను పరామర్శించిన డాక్టర్ రమేష్ బాబు

  • గుల్లింక మురళి కుటుంబ సభ్యులను పరామర్శించిన డాక్టర్ రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, తూర్పుపాలెం గ్రామ సర్పంచ్ గుల్లింక మురళి వెంకట సత్యనారాయణ (సత్తిబాబు) తండ్రి
నర్సింహామూర్తి కాలం చేశారు. వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను కలసి పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు జనసేన సమన్వయకర్త గుండుబోగుల పెదకాపు, జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, పినిశెట్టి బుజ్జి, అంతర్వేది దేవస్థానం ఎంపీటీసీ బైరా నాగరాజు, మల్కిపురం ఎంపీటీసీ జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్, మల్కిపురం మండల ఉపాధ్యక్షులు కుసుమ నాని, రాపాక మహేష్ తదితరులు.

  • గుల్లింక మురళి కుటుంబ సభ్యులను పరామర్శించిన డాక్టర్ రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, కేశనపల్లి గ్రామం ఎంపీటీసీ రాపాక సత్యనారాయణ తమ్ముని కుమారుడు రాపాక రాంబాబు అకాల మరణం చెందినారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, జనసేన నాయకులు పినిశెట్టి బుజ్జి, రాపాక సత్యనారాయణ, ఆంతర్వేది ఎంపీటీసీ బైరా నాగరాజు, రాపాక మహేష్ తదితరులు.