జెడ్పీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన డా.రవి కుమార్ మిడతాన

బీసీ బాలుర వసతి హాస్టల్ బొనంగి, జెడ్పీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డా.రవి కుమార్ మిడతాన, పాఠశాలలో విద్య ఆరోగ్యం, పరిశుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హాస్టల్ అంత కలియ తిరిగారు. అన్ని గదులను, బాత్ రూమ్ లను పరిశీలించారు. విద్యార్థులతో కలసి భోజనం చేసి, ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును, హాస్టల్ లోని భోజన సదుపాయం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. భోజనం సరిగ్గా పెడుతున్నారా, చదువు బాగా చెపుతున్నార అని విద్యార్థులను అడిగి తెలుసుకున్న అనంతరం పాఠశాల సిబ్బందితో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని హాస్టల్ ని పరిశుభ్రంగా ఉంచాలని హాస్టల్ లో దోమల బెడద ఎక్కువ ఉందని విద్యార్థులు తెలియచేయగా ప్రతిరోజు హాస్టల్ లోను పాగింగ్ చేయాలని వార్డెన్ కు తెలియజేశారు. ముఖ్యంగా విద్యార్థులకు జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్య సేవలు అందించాలని హాస్టల్లోకి ఎట్టి పరిస్థితులోను బయట ఆహారాన్ని అనుమతించొద్దు అన్నారు. అనంతరం స్టాక్ రికార్డులను పరిశీలించారు, ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది భాస్కర్ రావు, రాజు, వార్డెన్ చంద్రు నాయడు, జనసేన పార్టీ నాయకులు కలిదాసు పర్రి, మిడతాన రామునాయడు, పోటిపిరెడ్డి రమేష్, దేముల్లు, శివ, హరి, సాయి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment