రైతులను ఆదుకోవాలి.. కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన డాక్టర్ మిడతాన

జనసేన పార్టీ విజయనగరం జిల్లా నాయకులు మర్రాపు సురేష్ ఆదేశాల మేరకు శుక్రవారం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి ని కలిసి వినతిపత్రం అందజేశారు. జనసేన పార్టీ రైతులు పక్షాన ఎప్పుడూ పోరాడుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని జనసేన నాయకుడు డా.రవికుమార్ మిడతాన శుక్రవారం కలెక్టర్ సూర్యకుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని, రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదన్నారు. పండించిన పంటను అమ్ముకోలేక రైతులు నరకం అనుభవిస్తున్నారన్నారు. ట్రక్కు షీట్లు ఇవ్వకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. సంక్రాంతి పండగ నుంచి సక్రమంగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు రాత్రీ పగలూ కల్లాల్లో కాపలా కాసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు, రైతు భరోసా కేంద్రం సిబ్బంది కళ్ళాల్లోనే ధాన్యం తూకం వేసి మిల్లర్ల వద్దకు చేర్చడంతో పాటు 21 రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు వేస్తారని ముఖ్యమంత్రి చెప్పారని క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది అన్నారు. ధాన్యం కొనుగోలుకు గడువు పెట్టడం దారుణమన్నారు. తక్షణమే రైతులని ఆదుకోవాలని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురేష్ రెడ్డి, బద్రి జానీ,రాంబాబు పాల్గొన్నారు.