సర్వశిక్షా అభియాన్, కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెకు డా. రమేష్ బాబు మద్దతు

ముమ్మిడివరం: విద్యాశాఖ జిల్లా కార్యాలయం వద్ద గత 22 రోజులుగా తామంతా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడంతో వీరు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాంట్రాక్టు ఉద్యోగుల కొలువులను వెంటనే రెగ్యులర్ చెయ్యాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసారు. ఈ సమ్మెకు రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు గారు మాట్లాడుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులకు గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గం అని అన్నారు.కాంట్రాక్టు ఉద్యోగుల కొలువులను వెంటనే రెగ్యులర్ చెయ్యాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే రాబోయే తెలుగుదేశం, జనసేన ప్రభుత్వంలో వీరికి తప్పకుండా న్యాయం చేస్తామని‌ తెలియజేసి, సమ్మెకు ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేసారు. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దిరిశాల బాలాజీ, జనసేన నాయకులు పినిశెట్టి బుజ్జి, కంకపాటి నర్సింహారావు, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల పని కుమార్, జనసేన నాయకులు రావూరి నాగు, ఉండపల్లి అంజి గంటా నాయుడు, గిడుగు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.