మెడికల్ క్యాంపు ఏర్పాటుకు అంగీకరించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా

డాక్టర్ శ్రీధర్ పిల్లా ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ విరవాడ గ్రామంలో జన సైనికులతో ది. 31-07-2022 న ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు, దీన్ని తెలుసుకున్న ఎండపల్లి జనసైనికులు తమ ఊరు రావాల్సిందిగా కోరడంజరిగింది, జన సైనికుల కోరిక మేరకు ఎండపల్లి వెళ్లడం జరిగింది. దానిలో భాగంగా తమ ఊరిలో కూడా మెడికల్ క్యాంపు పెట్టాలని జనసైనికులు కోరడంజరిగింది, అయితే దీనికి డాక్టర్ శ్రీధర్ వచ్చేనెల మొదటి వారంలో పెడతానని హామీ ఇచ్చారు. దీనిలో శివ శంకర్ పిల్లా, గంజి గోవింద్, గొందిరెడ్డి అనిల్, సోమిరెడ్డి సాయి, పి.సూర్యనారాయణ. ఎస్. కొండబాబు, జి. రామస్వామి ఎం. సాయి, కే నూకరాజు స్క్. బషీర్, సోమిరెడ్డి నాగబాబు, గొంతకూరి అర్జున్, ఎన్. వాసు, ఎం. జగదీష్, జి. దుర్గాప్రసాద్, ఎస్. దుర్గ. తదితరులు పాల్గొన్నారు.