కందరాడ దుర్గామాత అమ్మవారి అన్నసంతర్పణ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా తన సొంత స్వగ్రామమైన కందరాడ గ్రామం నందు కమిటీ వారి ఆహ్వానం మేరకు దసరా ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి దుర్గామాత అమ్మవారి అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి 5116/- విరాళం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సైతన బుల్లి వెంకటరాజు(బాబ్జి), కేసిరెడ్డి దొరబాబు, సైతన నూకరాజు (రాజబాబు), కేసిరెడ్డి బుల్ రాజు, గుర్రం గంగాధర్, గ్రామపెద్దలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.