కందరాడ సత్తమ్మ తల్లి అమ్మవారి అన్నదాన సంతర్పణ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం, కందరాడ గ్రామం నందు గ్రామదేవత సత్తమ్మ తల్లి అమ్మవారి అన్నదాన కార్యక్రమంలో కమిటీ వారి ఆహ్వానం మేరకు పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా తన సొంత స్వగ్రామమైన కందరాడ గ్రామదేవత సత్తమ్మ తల్లి అమ్మవారి అన్నదాన సంతర్పణ కార్యక్రమంలో పాలుపంచుకొని భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు వెన్న జగదీష్, ఊట నాని బాబు, పిల్లా సూర్యనారాయణ, రామిశెట్టి సూరిబాబు, గంజి గోవిందరాజు, వాకపల్లి సూర్య ప్రకాష్, మరియు జనసైనికులతో కలిసి పాల్గొనడం జరిగింది.