కోనాడ లక్ష్మణరావు కుటుంబ సభ్యులను ఓదార్చిన డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామం నందు కోనాడ లక్ష్మణరావు అకాల మరణానికి చింతిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సంతాపం తెలిపి, వారి కుటుంబ అవసరాల నిమిత్తం 50 కేజీల బియ్యం మరియు కొంత నగదును ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మత్స్యకార నాయకులు పలివెల్ల బాపన్న దొర, వంకా కొండబాబు, జాన్సన్, రవి, సిహెచ్ పూరి జగన్నాథ్, తిత్తి హరిబాబు, దోను సాల్మను, వెంకట్రావు, గణపల రమేష్, చొక్కా చిన్న, గాదవరాజు, గాద శ్రీను, ఎస్ శ్రీనివాస్, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.