చేతికి అందిన కొడుకుని కోల్పోయిన కుటుంబానికి అండగా డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం, భోగాపురం గ్రామం నందు మన జనసైనికుడు గుర్రం దాసుకుమార్ ప్రేమ మమతా అనురాగాలు మా అందరికీ పంచి మా అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసి చిరునవ్వుతో అందరిని పులకరించే మన గుర్రం దాసుకుమార్ అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ అవసరాల నిమిత్తం ఒక నెలకు సరిపడా 50 కేజీల బియ్యం మరియు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కట్ట నానాజీ, పి రాజు, ఏ సత్తిబాబు, జి అప్పన్న, ఎం మైనేస్, డి లోవరాజు, జనసైనికులు మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.