నీటమునిగిన జగనన్న కాలనీని సందర్శించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా గొల్లప్రోలు పట్నం నందు కొత్తగా ఇచ్చినటువంటి జగనన్న కాలనీని సందర్శించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కాలనీని ఆనుకుని ఉన్న శుద్ధగడ్డ కాలువ మీదుగా ఉన్నటువంటి రహదారి నీటమునిగి రాకపోకలు నిలిచిపోయే పరిస్థితుల్లో ఉండి చిన్నపిల్లలు సైతం వాగులో కొట్టుకుపోయే పరిస్థితి ఉందని, ప్రభుత్వం తక్షణమే బ్రిడ్జి నిర్మించి శాశ్వత పరిష్కారం చూపించాలని జనసేన పార్టీ తరపున డాక్టర్ శ్రీధర్ పిల్లా కోరడం జరిగింది. ఇటువంటి వరదలు వరద వల్ల విషజ్వరాలు ప్రభావం, పాముకాటుకు గురయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం పేదవాడికి ఇల్లు ఇచ్చాము అనుకుంటే, ఏదో ఇచ్చామని చెప్పుకోవడానికి తప్పితే దానికి సరైన రోడ్స్ కాని పవర్ కాని కనీసం కాలనికి వెళ్లే రోడ్ కుడా వేయలేని పరిస్థితిలో ఈ వైఎస్సార్ ప్రభుత్వం ఉందని పేదవాడిపట్ల ఈ నిర్లక్షవైఖరి వీడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిజెపి పిఠాపురం మండల అధ్యక్షులు పిల్లా ముత్యాలరావు, ఉలవల సతీష్, సిహెచ్ శివ, పి గణేష్, ఎస్ స్వరూప్, బత్తిన వీరబాబు, వి సత్యనారాయణ, వాకపల్లి సూర్య ప్రకాష్, మాసా పెద్దపత్రయ, బొండాడ జయరాజు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.