పిఠాపురంకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, సినీ నటుడు, దర్శకుడు డాక్టర్ సునీల్ కుమార్ యాండ్రకు గ్లోబల్ ఫౌండేషన్ ప్రస్టీజియస్ గ్లోబల్ స్టార్ ఐకాన్ అవార్డ్ 2025 లభించింది. హైదరాబాద్ త్యాగరాయ గానసభలో జరిగిన ఫౌండేషన్ 9వ వార్షికోత్సవంలో ఈ అవార్డును సినీ ప్రముఖులు డా. బి. పృథ్వీరాజ్, నటి పవిత్ర, డాక్టర్ సృజన, న్యాయవాది శ్రీనివాసులు తదితరుల చేతుల మీదుగా అందుకున్నారు. పాత్రికేయ రంగంలో చిన్న వయస్సులోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీల్ కుమార్, తన రచనలు, సినిమాల్లోని పాత్రల ద్వారా సమాజానికి సేవ చేస్తున్నందుకే ఈ గౌరవం లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఫౌండేషన్ సేవా కార్యక్రమాలపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారుల సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అదే సందర్భంగా “ఓహో” ఓటీటీ లోగోను ఆవిష్కరించిన ఫౌండేషన్ చైర్మన్ డా. వి. సురేష్ కుమార్, చిన్న సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ విడుదలకు ఇది వేదిక అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ముప్పిడి హరీష్, కల్చరల్ ఆర్గనైజర్ యలమంచి వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment