ఎల్లవరం గ్రామంలో పర్యటించిన డా.వంపూరు గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెం కొత్తవీధి మండలం, వంచుల పంచాయితీ ఎల్లవరం గ్రామంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు జనసేన నాయకులు గ్రామ పర్యటనచేయడం జరిగింది. ఈ సందర్బంగా కూడా మధుబాబు, కొయ్యం బాలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ డా.గంగులయ్య ఈ సందర్బంగా మాట్లాడుతూ ముఖ్యంగా ఎల్లవరం గ్రామ పరిస్థితి, రైతులు పండించే ఈ ప్రాంతం ముఖ్యమైన పసుపు పంటలు వారి రహదారి పరిస్థితులు, తాగునీటి వ్యవస్థ వంటి మౌళిక సదుపాయలు కల్పన విషయమై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గతంలో గడప గడపకి వైసీపీ అంటూ ప్రత్యేకంగా ఈ గ్రామాలను సందర్శించిన వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు మా బాధలు చెప్పుకుంటే వాళ్ళు వెకిలి నవ్వులు నవ్వడం మేము జీర్ణించుకోలేకున్నామని గ్రామస్తులు తెలపడంతో గంగులయ్య విస్తుపోయారు. కనీసం మంచినీటి సదుపాయం కల్పించడంలో వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడం బాధాకరం రైతులు పండించిన పంటలు మార్కెట్ కి తరలించడానికి సరైన రహదారి వ్యవస్థ లేదు సరికదా! ఈ రాష్ట్రాన్ని రాక్షసా పాలన చేస్తున్న మూడు ముక్కల ముఖ్యమంత్రికి గిరిజన ప్రజాప్రతినిధులు గిరిజన జాతికి ద్రోహం చేస్తూ తానా తందానా పాడటం వారి నిరంకుశ విధానానికి నిదర్శనం. మన ఎంపీ, ఎమ్మెల్యే కూడా ఈ గిరిజన ద్రోహి ప్రభుత్వానికి గులాంగిరి చెయ్యడం చూస్తే విస్మయానికి గురౌతున్నాం. స్థానిక ఎంపీటీసీ, సర్పంచిలు కూడా పట్టించుకున్న ధాఖాలాలు లేవు ఇక పై ప్రజా సమస్యలపై జనసేన అలుపెరగని పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాము. ప్రజల్లో చైతన్యం రావాలని ప్రజాప్రతినిధులను అధికారులను ప్రశ్నించే తత్త్వం ప్రజల్లో ఎప్పుడు వస్తుందో? అప్పుడు మన అభివృద్ధి నీ ఆశించవచ్చంటూ గ్రామస్తులనుద్దేశించి అన్నారు. గిరిజన అభివృద్ధికి ఏర్పాటైన సకల వ్యవస్థలాన్నిటిని నిర్వీర్యం చేస్తూ ఇప్పుడు గడప గడపకి అంటూ వస్తూ ప్రజల సమస్యలపై స్పందించకపోవడం గాక వెకిలి నవ్వులు నవ్వే వాళ్ళని ఏమనాలో మీరే నిర్ణయించండంటూ ఏద్దేవా చేసారు. మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు పూర్తిగా వైసీపీ నాయకత్వం కోల్పోయిందంటూ ఇప్పుడు ఎ మొహంతో ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతారో మరీ మాకైతే తెలియట్లేదని అన్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులు పెద్దఎత్తున జనసేన పార్టీ సిద్ధంతాలకు ఆఖర్షితులై గంగులయ్య ఆధ్వర్యంలో కండువాలు కప్పుకుని పార్టీలోకి చేరారు వారిని సాధారంగా ఆహ్వానించి ఇకపై జనసేన పార్టీ మీకు స్వాగతం చెప్తుందంటూ వారిని పార్టీలోకి చేర్చుకుని మనమందరు కలిసి ప్రయాణిద్దామంటూ తెలిపారు. ఈ సమావేశం నిర్వహించిన కూడా మధుకుమార్, కొయ్యం బాలరాజులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. ఈ సమావేశంలో గూడెం మండల నాయకులు రాంబాబు, మార్క్, సిద్దూ, బాలరాజు, మధుకుమార్, చిన్నా చింతపల్లి మండల నాయకులు బుజ్జిబాబు, లీగల్ అడ్వయిజర్ రాజన్, పునీత్, స్వామి, చిట్టిబాబు రవి, రవికుమార్, జీ.మాడుగుల మండల అధ్యక్షులు మాసడి భీమన్నా, భానుప్రసాద్, అంకిత్ కార్యనిర్వాహక అధ్యక్షులు తాంగుల రమేష్, అఖిల్, మధు, పాడేరు మండల నాయకులు అశోక్, సంతోష్ తదితర జనసైనికులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.