జనసైనికుని షాపు ప్రారంభోత్సవంలో పాల్గొన్న డా.విశ్వక్షేణ్

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, మంగళవారం కొత్తకోట పంచాయతీ జనసైనికుడు టిఫిన్ షాపు పెట్టడం జరిగింది. ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు, రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా.విశ్వక్షేణ్ ని ఆహ్వానించి రిబ్బన్ కటింగ్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ గ్రామ సమస్యలు ఆ గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరించుకుందామని మాట ఇచ్చారు. ఒక్కసారి జనసేన వైపు చూడండి పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఇవ్వండని ప్రజలను అడగటం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అలాగే జనసైనికులు పాల్గొన్నారు.