ఎచ్చెర్ల నియోజకవర్గంలోని జి.సిగడాం హెడ్‌క్వార్టర్ సమీపంలో సావిటీ హరిశంకర్ ప్రకాశ్, బలరాం, ముద్దాడ త్రినాథ్, బోనెల గౌరీ శంకర్ స్కూల్ యాజమాన్యం ఆహ్వానంతో నూతనంగా ప్రారంభమైన అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ను జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. విశ్వక్సేన్ సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా డా. విశ్వక్సేన్ విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు పరిశీలించి, నూతన విద్యాసంస్థకు అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ స్థాయి పాఠశాలలు స్థాపితమవడం సానుకూల మార్పుకు సూచిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పొగిరి అప్పలనాయుడు, రామరాజు, రణస్థలం మండల జనసేన నాయకులు మైలపల్లి రాంప్రసాద్ గారులతో పాటు అనేకమంది జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment