అక్రమంగా అరెస్ట్ అయిన జనసైనికుల కుటుంబాలను పరామర్శించిన డా. పసుపులేటి

  • జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అక్రమంగా అరెస్ట్ అయిన పూతలపట్టు జనసైనికుల కుటుంబాలను పరామర్శించిన డా. పసుపులేటి హరి ప్రసాద్

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గడప గడపకు అనే కార్యక్రమంలో ప్రభుత్వం అమలు పరుస్తున్న పతాకాల అవకతవకలపై నిలదీసినందుకు జనసేన నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది.

అరెస్టు అయిన జనసేన నాయకుల తల్లితండ్రుల గుండెల్లో భాదను తొలగించి ధైర్యాన్ని నిపడానికి వేపనపల్లి, కూటంవారిపల్లిలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ గారు గ్రామాల్లో పర్యటించి పరామర్శించారు.

ఈ అమానుషమైన చర్యను తీవ్రంగా ఖండించి అరెస్టు అయిన ప్రతి ఒక్కరినీ విడిపిస్తామని మీ కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు.

జిల్లా అధ్యక్షుల వారి వెంట రాష్ట్ర, జిల్లా, మండలాల కమిటీల సభ్యులు, జనసేన నాయకులకు మరియు వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.