జనసేన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన డా. పసుపులేటి హరిప్రసాద్

  • తిరుపతిలో జనసేన సన్నాహక సమావేశంలో పార్టీ నేతలకు సూచన

తిరుపతి: జనసేన పార్టీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలో జనసేన పార్టీ బలంగా ఉందని, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతి జనసైనికుడు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. టిడిపి నేతలతో సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి జనసైనికుడు పనిచేయాలన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో తిరుపతిలో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. తిరుపతి నగర కమిటీలు,వార్డ్ కమిటీలు ఏర్పాటు చేసాము బూత్ లెవల్ లో కూడా కమిటీలను పటిష్ఠం చేస్తున్నామన్నారు. టిడిపి నేతలతో కలిసి పార్టీ శ్రేణులు ఉమ్మడిగా పార్టీ అధినాయకత్వం సూచించిన కార్యాచరణ అమలయ్యేలా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ ఇంచార్జ్ కిరణ్ రాయల్, తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, తిరుపతి నగర మరియు వార్డ్ ఇంచార్జిలు, జనసైనికులు, వీరామహిళలు పాల్గొన్నారు.