కలికిరి ప్రజాగళం సభా స్థలిని పరిశీలించిన డా. పసుపులేటి

తిరుపతి: జనసేన పార్టీ తరపున కలికిరిలో ప్రధాని నరేంద్ర మోడీ రానున్న సందర్బంగా సభా స్థలిని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర పీఏసీ సభ్యులు డా. పసుపులేటి హరిప్రసాద్ పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోడీ రానున్న సభకు కోఆర్డినేటర్ గా జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ సభ స్థలిని పరిశీలించిన తరువాత రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లరి కిరణ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థి నల్లరి కిషోర్ కుమార్ రెడ్డిని కలిసి మోడీ రానున్న సభ గురించి చర్చించటం జరిగింది. సువర్ణాక్షరాలతో లిఖించేలా కలికిరి “ప్రజాగళం” సభను విజయవంతం చేయాలని కూటమి పిలుపు రేపటితో రాష్ట్రానికి జగన్ పీడ విరగడ కాబోతోందన్న నేతలు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 8న కలికిరిలో నిర్వహించనున్న చారిత్రాత్మక ప్రజాగళం బహిరంగ సభకు మూడుపార్టీల ముఖ్యనేతల సారధ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో పనులను టిడిపి, జనసేన చైర్మన్, బిజెపి ఉమ్మడి నాయకులతో చర్చించుకోవటం జరిగింది. ప్రధాని మోడీ హాజరుకానున్న ఈ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కదలిరావాలని ముఖ్యనేతలు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈనెల 8వ తేదీ జరగనున్న ప్రజాగళం సభకు ప్రధాని మోడీ హాజరువుతున్నారు. కలికిరి ప్రజాగళం సభ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. మూడు పార్టీల ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతోంది. ఏపీ చరిత్రలో అనేక పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. రాష్ట్ర భవిష్యత్ కోసమే మూడు పార్టీలు పొత్తుపెట్టుకున్నాయి. కుల, మతాలకు అతీతంగా ప్రజలు పొత్తును ఆశీర్వదించాలి. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వారంతా ప్రజాగళం సభలో పాల్గొని విజయవంతం చేయాలి. ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. జగన్ పాలనలో ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రజల హక్కులను కాలరాశారు. జగన్ పీడ రాష్ట్రానికి విరగడ కాబోతోంది. అధికారులు స్వేచ్ఛగా పనిచేయాలి. ప్రజాస్వామ్యాన్ని పునరుజ్జీవింపచేసుకుని ఎన్నికలకు సన్నద్ధమవుదాం. కలికిరి సభలో అన్నివర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి. జాతీయస్థాయిలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. సభా ఏర్పాట్లకు పోలీసు డిపార్ట్ మెంట్ కూడా సహకరించాలి. ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సభను విజయవంతం చేస్తారని భావిస్తున్నాం.