గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్.ఆర్.పురం మండలం, పుల్లూరు క్రాస్ శ్రీ సత్య సద్గురు సాయిబాబా మందిరంలో మార్చి 14న జరగనున్న 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన సందర్భంలో ఏపీ మాల వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్, స్టేట్ డైరెక్టర్ మరియు గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, ఉపాధ్యక్షులు చార్లెస్ చంద్రశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, మండల కార్యదర్శి సోము, మండల సంయుక్త కార్యదర్శులు జాఫర్, ఖాదర్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు మాదాసి వెంకటేష్, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి అన్నామలై, మరియు జనసేన పార్టీ నాయకులు వజ్రవేలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment