*శుభప్రారంభానికి హాజరైన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్
నరసాపురం మండలం రుస్తుంబాద్‌లో మురుగు కాలువల పూడికతీత పనులు శుక్రవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ హాజరై, అనంతరం స్వయంగా స్ప్రేయర్ ద్వారా గడ్డి మందు పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గం మొత్తం లో డ్రైన్లు, కాలువల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, పూడికతీత పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అవరోధం లేకుండా చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డెల్టా వైస్ చైర్మన్ గుబ్బల మారాజు, బందేల రవీంద్ర, గంట కృష్ణ, పట్టిప్రోలు సతీష్, నిప్పులేటి తారకరామారావు, పులి భుజంగరావు, ఇంటి మురళి, అడబాల బాబు తదితరులు పాల్గొన్నారు. జనసేన, తెలుగుదేశం, భాజపా నాయకులు, కార్యకర్తలు, మహిళా శక్తి, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Share this content:
Post Comment