కరోనాతో డ్రైవర్‌ మృతి.. హోం ఐసోలేషన్‌లో రామ్‌ చరణ్

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. సీనీ, రాజకీయ, క్రీడా ప్రముఖులను సైతం ఈ మహ్మారి వదలడంలేదు. టాలీవుడ్ లో ఇప్పటికే ఎందరో కరోనా బారిన పడ్డారు. రామ్‌ చరణ్ వ్యానిటీ డ్రైవర్ జయరాంకు ఇటీవల కరోనా సోకింది. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న ఆయన ఈరోజు మృతి చెందారు.

మరోవైపు జయరాంకు కరోనా సోకిన సంగతి తెలిసిన వెంటనే చరణ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయాడు. జయరాం మృతి చెందిన నేపథ్యంలో, చరణ్ కోవిడ్ టెస్టులు చేయించుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే చరణ్ ఒకసారి కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు మహేశ్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ కు కూడా కరోనా సోకడంతో… ఆయన కూడా ఐసొలేషన్ లో ఉన్నారు.