సాయి ధరమ్ తేజ్ ను కలిసిన దుగ్గిశెట్టి

నెల్లూరు: జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు శనివారం విశాఖపట్నంలో ప్రముఖ హీరో సాయిధరమ్ తేజ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రో చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా ఆయనను విశాఖపట్నంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. జనసేన నగర అధ్యక్షుడుగా సుజయ్ బాబు చేస్తున్న కార్యక్రమాలను ఆయన అడిగి తెలుసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మున్ముందు ప్రజలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ తనకు 2008 నుంచే సాయి ధరమ్ తేజ్ తో పరిచయం ఉందన్నారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేసుకొని తీరుతామన్నారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ఒక పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర సాయి తేజ అభిమాన సంఘ నేతలు శాంతి తేజ్, హరీష్ లు కూడా సాయిధరమ్ తేజను కలిసిన వారిలో ఉన్నారు.