తలకు గాయంతో పడిపోయిన డుప్లెసిస్..
పాక్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో స్టార్ ప్లేయర్ డుప్లెసిస్ తలకు గాయమైంది. డుప్లెసిస్ ప్రస్తుత లీగ్ లో క్వెట్టా గ్లాడియేటర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. శనివారం జూన్ 12న అబుదాబి వేదికగా పెషావర్ జాల్మితో మ్యాచ్ జరిగింది. ఫీల్డింగ్ చేస్తూ బౌండరీకి వెళ్తోన్న బంతిని ఆపేందుకు డైవ్ చేశాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెటర్ మొహమ్మద్ హస్నైన్ ను ఢీ కొట్టాడు. అదే సమయంలో డుప్లెసిస్ తలకు హస్నైన్ మోకాలు తగలడంతో సఫారీ ప్లేయర్ కింద పడిపోయాడు. ఆ వెంటనే వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు.
డుప్లెసిస్ గాయపడ్డ సంగతి తెలిసిన అభిమానులు.. అతను త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయిన డు ప్లెసిస్.. తిరిగి హోటల్ రూమ్‌కి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో డు ప్లెసిస్ జట్టు క్వెట్టా గ్లాడియేటర్స్ ఓటమి పాలైంది. ఇక శనివారమే డెన్మార్క్ ఫిన్లాండ్ ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా క్రిస్టియన్ ఎరిక్సెన్ మైదానంలోనే కుప్పకూలి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే.
Thank God! Faf Du Plessis has returned to the team hotel bubble from hospital, It's nothing serious. 💛#Yellove | @faf1307 | #WhistlePodu https://t.co/0n4WbOQuIG
— AIPWA@ANI (@AIPWAANI5) June 13, 2021