అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం

ఇంద్రకీలాద్రి పై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా నవరాత్రులలో నాలుగవ రోజైన చవితి నాడు బెజవాడ కనకదుర్గమ్మ అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తుంది, సృష్టిలోని ప్రతీజీవికి కావలసిన చైతన్యం కలిగించే మహాశక్తి అన్నపూర్ణ. ఒక చేతిలో అక్షయ పాత్రతో, మరియొక చేతిలో గరిటెతో దర్శనమిస్తుంది. సాక్షాత్తూ పరమేశ్వరునికే భిక్షనొసంగిన అన్నపూర్ణ అక్షయ శుభాలను కలిగిస్తుంది.  ఆలయానికి భక్తులు, భవానీలు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని తరిస్తున్నారు.