ఇంద్రకీలాద్రి పై నేటి నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వబోతోంది. మొదటిరోజైన ఇవాళ దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. 9 గంటల నుంచి అమ్మవారి దర్శనార్ధం భక్తులకు అనుమతి ఇస్తారు. కోవిడ్‌ దృష్ట్యా రోజుకు పది వేల మంది భక్తులకు మాత్రమే కొండపైకి అనుమతి ఇస్తున్నారు. స్లాట్ లేని భక్తులకు అనుమతి నిరాకరణ. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష పూజలకు అనుమతి నిరాకరించిన దేవస్థానం.. పరోక్షంగా జరిగే పూజలను వీడియోస్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించింది. ఉత్సవాలకు నాలుగు వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.