దువ్వాడ నోరు అదుపులో పెట్టుకో…!:

  • జిల్లా సీనియర్ నాయకులు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డా.రవి కుమార్ మిడతాన

గజపతినగరం, మా అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మి విమర్శించేంత స్థాయా నీది? అని జిల్లా సీనియర్ నాయకులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డా.రవి కుమార్ మిడతాన అన్నారు. మంగళవారం వారి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు నెలకు రూ 50 కోట్ల ముడుపులను దమ్ముంటే నిరూపించు, జనసైనికులు, వీర మహిళలు నీకు తగిన బుద్ధి చెబుతారు. ప్రజలకు సంక్షేమాన్ని పూర్తిస్థాయిలో అందించేది‌ కూటమి ప్రభుత్వం మాత్రమే, ప్రజలు ఛీ కొట్టిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది?దువ్వాడ శ్రీనివాస్ తీరును రాష్ట్ర ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ పై,కూటమి ప్రభుత్వంపై దువ్వాడ చేసిన ఆరోపణలు లో నిజం లేదు అన్నారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లడితే సహించబోమని చెప్పారు. దువ్వాడ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయా నీది? అంటూ ప్రశ్నించారు. ఆయన మీద నమ్మకంతో ప్రజలు జనసేన పార్టీని ఆదరించి 21కి 21 సీట్లు ఇచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ అందిస్తుందని స్పష్టం చేశారు.సూపర్ సిక్స్ ను తప్పక అమలు చేస్తుందని ఘంటాపథంగా చెప్పారు. ఇప్పటికే పింఛను,ఏడాదికి మూడు సిలిండర్లను ఇస్తోందని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత,పవన్ కల్యాణ్ సహకారం, బీజేపీ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని అన్నారు.మరోసారి పవన్ కల్యాణ్ గారిపై,కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలితే రోడ్డు మీద కూడా తిరగనివ్వబోమని ఆయన హెచ్చరించారు, ప్రజలంతా చీ కొడితేనే కదా అధికారం పోయి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది. ప్రతిపక్ష హోదా వస్తేనే ప్రజల సమస్యల గురించి ప్రశ్నిస్తారా ? అసలు సభకు వస్తే కదా సమయం ఇస్తారా? ఇవ్వరా? ఎంత సమయం ఇస్తారు అన్న విషయం తెలిసేది. ప్రతిపక్ష హోదా అన్నది కేవలం తప్పించుకు తిరగడానికి ఒక సాకు.అరాచకాల గురించి మాట్లాడే అర్హత అసలు మీ పార్టీలో ఎవ్వరికుంది దువ్వాడ..? వైసీపీ అంటేనే పెద్ద విధ్వంసక శక్తి అని ముద్ర పడి రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు పోయాయి. అభివృద్ధి కుంటుబడింది. కుప్పలు కుప్పలుగా అప్పులు తెచ్చి సంక్షేమం ముసుగులో ప్రజల్ని మభ్యపెట్టి మళ్లీ గెలుద్దామనుకున్నారు. మీరు చేసిన సంక్షేమానికి ప్రజలంతా హ్యాపీగా ఉంటే మిమ్మల్ని ఎందుకు 11కి పరిమితం చేస్తారు? అధికారం చేపట్టిన వెంటనే పింఛన్ వెయ్యి రూపాయిలు పెంచి మూడు నెలల బకాయిలు కలిపి చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వానిది.అదే వెయ్యి రూపాయిల పింఛన్ పెంచేందుకు ఏడాదికి రూ.250 చొప్పున నాలుగేళ్లు సమయం తీసుకున్న ఘనత మీ జగన్ రెడ్డి ప్రభుత్వానిది. సంక్షేమం గురించి మాట్లాడే హక్కు మీకెక్కడుంది. ఎన్నికల ముందు ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకు అమ్మఒడి ఇస్తానని చివరికి యూటర్న్ తీసుకున్నాడనేగా ఆ జగన్ మామయ్యను అంతా చీకొట్టారు. అయినా సిగ్గురాలేదా? అధికారం చేపట్టిన ఎన్నాళ్లకి అమ్మఒడి అమలు చేశారు.ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు మీకుందా?సరైన ఇసుక పాలసీ అమలు చేయకుండా భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారు.బాబాయ్ గొడ్డలి వేటు మాదిరి ఎంతో మందిని బలి చేశారు. దళిత డాక్టర్ సుధాకర్ ప్రశ్నిచినందుకు పిచ్చోడిని చేసి చంపేశారు.ఎమ్మెల్సీ దళితుడిని చంపి బాడీ డోర్ డెలివరీ ఇచ్చాడు. అరాచకం అనే మాటకు పర్యాయ పదమే వైసీపీ. దువ్వాడా నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా? ఐదేళ్ల నుంచి ప్యాకేజీ ప్యాకేజీ అని మొరుగుతున్నా, నింధలు వేయడం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కాదు. దమ్ముంటే నిరూపించి మాట్లాడండి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర బాగు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి.గెలిచాక ఇప్పటి వరకు కనీసం ఒక్క రూపాయి జీతం తీసుకోని వ్యక్తి. తాను తీసుకున్న శాఖలో ఆర్ధిక పరిస్థితి చూసి ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని నిర్వహణ భారం ఎందుకని వదులుకున్న వ్యక్తి.అలాంటి నాయకుడి కాళ్లు కడిని నెత్తిన చల్లుకున్నా మీరు చేసిన పాపాలకు ప్రాయచ్చిత్తం కలగదు. వరదలు వస్తే పంచాయతీలకు సొంత డబ్బు 4 కోట్లు ఖర్చు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.రెండు కోట్లు ప్రకటించి ఎగ్గొట్టిన వ్యక్తి మీ పార్టీ నాయకుడు ఆయన మీద నింధలు వేస్తే జనం తరిమి తరిమి కొడతారు ఒక్కొక్కడిని,ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడక పోతే దువ్వాడా, జనం రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి జాగ్రత్త. కుటుంబాన్ని, భార్య పిల్లలని గాలికి వదిలేసి..సభ్య సమాజం తలదించుకునేలా ఉంపుడుగత్తెతో తైతక్కలాడే నువ్వు నీతులు మాట్లాడడమా..? మీకు నిజంగా ప్రజా సమస్యల పట్ల నిబద్దత ఉంటే 11 మంది రోజూ అసెంబ్లీకి వెళ్లండి.ప్రతి సభ్యుడికీ ఇచ్చినట్టు మీ వాళ్లకి సమయం ఇస్తారు. ప్రజల సమస్యలు మాట్లాడండి అంతా హర్షిస్తారు. వేటు భయంతో 11 మంది 11 నిమిషాలు సభలోకి వచ్చి గవర్నర్ లాంటి వ్యక్తిని కించపర్చే చర్యలకు పాల్పడి.సభలో అల్లర్లు చేసి మీడియా ముందుకు పిచ్చ ఏడుపులు ఏడిస్తే.. జనం అన్నీ చూస్తూనే ఉంటారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కాళిదాసు పార్రి, రమునాయుడు, దేముళ్ళ, కుర్మారావు, మజ్జి సత్యనారాయణ, శ్రీరామ్, శ్రీనివాస్, మోహన్, యస్వంత్, నారాయణ రావు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment