దువ్వాడా నోరు అదుపులో పెట్టుకో..!

•జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను
•జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఏపీఐఐసీ చైర్మన్ మండలి రాజేశ్

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీరును రాష్ట్ర ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ పై, కూటమి ప్రభుత్వంపై దువ్వాడ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. గురువారం తన నివాసంలో ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేశ్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలపై దుమ్మెత్తిపోశారు. పవన్ కళ్యాణ్ గారికి నెల నెలా రూ. యభై కోట్లు ముడుపుల రూపంలో వస్తున్నాయంటూ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లడితే సహించబోమని చెప్పారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే జనసైనికులు, వీరమహిళలు దువ్వాడను శ్రీకాకుళం సముద్రంలో కలిపేస్తారని హెచ్చరించారు. దువ్వాడ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయా నీది? అంటూ ప్రశ్నించారు. ఆయన మీద నమ్మకంతో ప్రజలు జనసేన పార్టీని ఆదరించి 21కి 21 సీట్లు ఇచ్చారని అన్నారు. పవన్ గారు అర్జునుడు లాంటివాడని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ అందిస్తుందని ఉదయభాను స్పష్టం చేశారు. ఇంకా ప్రభుత్వానికి నాలుగు సంవత్సరాలకు పైగానే సమయం ఉందని.. సూపర్ సిక్స్ ను తప్పక అమలు చేస్తుందని ఘంటాపథంగా చెప్పారు. ఇప్పటికే పింఛను, ఏడాదికి మూడు సిలిండర్లను ఇస్తోందని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత, పవన్ కళ్యాణ్ గారి సహకారం, బీజేపీ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని అన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేశ్ మాట్లాడుతూ.. దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. యూట్యూబ్ లో రీల్స్ చేసుకునేవాడివి నీకెందుకు రాజకీయాలంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రాదని తెలిసి కూడా హడావిడి చేస్తున్న దువ్వాడకు ఎమ్మెల్సీ ఇచ్చిన దరిద్రపు ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. మరోసారి పవన్ కళ్యాణ్ గారిపై, కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలితే రోడ్డు మీద కూడా తిరగనివ్వబోమని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ కొలగాని రాము, మైనారిటీ నాయకులు షేక్ సత్తార్, ఏపీ బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కోసూరి ప్రహ్లాద్, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఈమని కిషోర్, నాయకులు ఆవాల భవానీ ప్రసాద్, ఎస్సీ నాయకులు అన్నెపాక నరసింహారావు, ఇరుగు రవీంద్ర, మాజీ కౌన్సిలర్ చారుగుండ్ల కొండ, న్యాయవాది సామినేని రాము, వజ్రాల శిరీష, మేడూరి వెంకటాద్రి(బబ్లూ) తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment