దొరవారి సత్రం మండల అధ్యక్షుడిగా దువ్వూరు సనత్ కుమార్

సూళ్లూరుపేట, దొరవారి సత్రం జనసేన మండల అధ్యక్షుడిగా దువ్వూరు సనత్ కుమార్ నియమించడం జరిగింది. ఈ సందర్భంగా దువ్వూరు సనత్ కుమార్ మాట్లాడుతు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ మనుక్రాంత్ రెడ్డికి, నెల్లూరు జిల్లా నాయకులకు, మా అన్న శ్రీ బురకాల లీలా మోహన్ కి ధన్యవాదాలు తెియజేస్తున్నానని… పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతానని, మా అధినేత పవన్ కళ్యాణ్ మా అన్న నెల్లూరు జిల్లా సంయుక్త కార్యదర్శి మరియు సూళ్లూరుపేట నియోజకవర్గం యువ నాయకుడు బురకాల లీలా మోహన్ అడుగు జాడల్లో నడుస్తూ జనసేనపార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నానని. దొరవారిసత్రం మండలం జనసైనికుల సూచనలతో ముందుకు పోయి ఏ సమస్యను అయినా సాల్వ్ చేసే దిశగా చేస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు.