వెంకట కృష్ణాపురం మీదుగా ద్వారకా తిరుమల బస్సు సర్వీసు పునరుద్ధరణ

ఏలూరులో, ఆర్టీసిని లాభాలబాటలో పయనింపచేసేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. అదే ఆలోచనతో ఆర్టీసిలో వివిధ నామినేటెడ్‌ పదవుల్ని భర్తీచేయడం జరిగిందన్నారు. ఏలూరు నుండి ద్వారకాతిరుమల కొండపైకి వయా వెంకట కృష్ణాపురం మీదుగా నూతన పల్లెవెలుగు బస్సు సర్వీసును ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసి విజయవాడ జోన్‌ – 2 ఛైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు. ఏలూరులోని కొత్త బస్టాండ్‌లో జరిగిన కార్యక్రమంలో రిబ్బన్‌ కట్‌ చేసి సర్వీసును ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గతంలో ఎన్నడూలేని విధంగా ఆర్టీసిని లాభాలబాటలో నడిపేందుకు ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉండేలా ఇప్పటికే అనేక నూతన బస్సులు, స్లీపర్‌ కోచ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చామన్న ఎమ్మెల్యే చంటి, ఎన్నో ఏళ్ళక్రితం ఆగిపోయిన ఏలూరు నుండి వెంకట కృష్ణాపురం మీదుగా ద్వారకాతిరుమల సర్వీసును తిరిగి పునరుద్దరించామన్నారు. ఆర్టీసి సేవల్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఆర్టీసి జోన్‌ – 2 ఛైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రయాణీకులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆర్టీసి సేవలు ఎంతో కీలకంగా నిలుస్తున్నాయన్నారు. తాజాగా ద్వారకాతిరుమల కొండపైకి కూడా బస్సు సర్వీసులు అందుబాటులోకి రావడంతో అక్కడకు వెళ్ళే యాత్రికులకు ఈ నిర్ణయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ బి.వాణి, ఏఎంటి జి.మురళి, ఎమ్‌ఎఫ్‌ ఐ.ప్రేమ్ కుమార్, బస్టాండ్ ఇంచార్జ్ కుమారి, పిఆర్ఓ నరసింహం, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment