ఉదయాన్నే.. కోటి గ్రామ ఉపాధి హామీ రైతుకూలిలతో “గురుదత్”

  • జనసేన జనజాగృతి యాత్ర 64వ రోజు

రాజానగరం: జనసేన జనజాగృతి యాత్ర (64)రోజులో భాగంగా రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోటి గ్రామ ఉపాధి హామీ పని చేస్తున్న రైతుకూలిలను ఉదయాన్నే స్వయంగా వారి దగ్గరకి వెళ్లి వారి వారి గ్రామంలో ఉన్న సమస్యలు, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రైతులకు చేసిన మేలుగురించి రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా కోటి గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. 32ఎకరాలు ఉన్న గండోడు చెరువు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుభ్రపరుస్తామని చెప్పి ఇప్పటికి పనులు మొదలుపెట్టలేదు అని జనసేన పార్టీ తరపున మాకు అండగా ఉండాలని ఇంచార్జ్ గారిని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా గురుదత్ మాట్లాడుతూ.. ఈ సమస్యపై పూర్తి స్థాయిలో అవగాహన రావాలి అంటే గ్రామ గ్రామంలో పెద్దల సలహా మేరకు నియోజకవర్గం అంతటా తిరిగి ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకుని ఒక నివేదిక తయారు చేసి జనసేన పార్టీ తరపున ఎంఆర్ఓ-ఎండిఓ ఆఫీస్ లో సమర్పిస్తామని ప్రజలకు తెలియజేసారు. అలానే గ్రామ మంచినీటి కోనేరు సమస్య జనసేన పార్టీ ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసారు. జనసేన ఆధ్వర్యంలో ఉపాధి హామీ 400మంది రైతుకూలిలకు మజ్జిగ పంపిణి: ఈ కార్యక్రమం కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, సీతానగరం మండలం కో-కన్వీనర్ కాత సత్యనారాయణ, గొల్లకోటి కృష్ణ, దేవన కృష్ణ చదువు ముక్తేశ్వరరావు, గేదల సత్తిబాబు, తన్నీరు తాతాజీ, చదువు నాగేంద్ర, గణశాల గిరీష్, అడపా పోసి, అడపా వీరబాబు, దూలం సాయి, కొల్లూరి లిలయ్య గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

  • నలగొండ ఉపాధి హామీ రైతుకూలీలతో “గురుదత్”

జనసేన జనజాగృతి యాత్ర 64వ రోజులో భాగంగా రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, నలగొండ గ్రామ ఉపాధి హామీ పని చేస్తున్న రైతుకూలీలను ఉదయాన్నే స్వయంగా వారి దగ్గరకి వెళ్లి వారి వారి గ్రామంలో ఉన్న సమస్యలు, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ రైతులకు చేసిన మేలుగురించి రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వివరించడం జరిగింది. నలగొండ గ్రామ ప్రజలు మాట్లాడుతూ వారి గ్రామంలో డ్రైనేజ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది వర్షాకాలంలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని తక్షణమే డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని మాకు జనసేన పార్టీ తరపున మీరు అండగా ఉండాలని ఇంచార్జ్ ని ప్రజలు కోరడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 200మంది ఉపాధి హామీ రైతుకూలీలకు మజ్జిగ పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, సీతానగరం మండలం కో-కన్వీనర్ కాత సత్యనారాయణ, గొల్లకోటి కృష్ణ, దేవన కృష్ణ చదువు ముక్తేశ్వరరావు, గేదల సత్తిబాబు, తన్నీరు తాతాజీ, చదువు నాగేంద్ర, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.