గుంతకల్లు పట్టణంలోని ప్రైవేటు విద్యాసంస్థలు నర్సరీ విద్యార్థుల అడ్మిషన్ల కోసం వేలు వేలు వసూలు చేయడం మరియు పాఠ్య పుస్తకాలను అధిక రేట్లకు అమ్మడం వంటి దోపిడీ చర్యలపై గుంతకల్లు ఆర్డీఓ మరియు ఎం.ఈ.ఓలకు చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు వినతిపత్రం అందజేశారు. ప్రైవేటు విద్యాసంస్థల అధిక ఫీజుల వసూలు నియంత్రణ. అన్ని స్కూళ్లలో ఒకే విధమైన ఫీజు వ్యవస్థ అమలు చేయడం. పాఠ్య పుస్తకాలు అధిక రేట్లకు అమ్మకాన్ని నివారించడం వంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో జనసేన పట్టణ అధ్యక్షులు బండి శేఖర్, బిజేపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి వనగొంది విజయలక్ష్మి, బిజేపి కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుర్రం సూర్యనారాయణ, టిడిపి ముఖ్య నాయకులు ఫజలు, కాజా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మహమ్మద్ గౌస్ తదితరులు ఉన్నారు.
Share this content:
Post Comment