ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి!

*శిక్షణా కార్యక్రమాల ద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి
*2047 స్వర్ణాంధ్ర దిశగా ముమ్మర చర్యలు

అమరావతి, జూన్ 23: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పరిశ్రమలు, ఎంఎస్ఎంఇలు, సీడాప్ సంస్థలు కలిసి సమన్వయంతో పని చేయనున్నట్లు ప్రకటించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్, ఎంఎస్ఎంఇ చైర్మన్ శివ శంకర్, సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. లంకా దినకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలోనే రూ. 9.3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహంతోపాటు “స్పీడ్ ఆఫ్ బిజినెస్” దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఇలు గేమ్ చేంజర్‌గా మారనున్నాయి రాష్ట్రంలో ఇప్పటికే 8 లక్షలకి పైగా ఎంఎస్ఎంఇలు ఉన్నాయని, దేశ ఘ్డ్ఫ్లో 30% వాటా, ఎగుమతుల్లో 40% వాటా ఈ రంగానిదే అని చెప్పారు. వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుతో అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని వెల్లడించారు. శిక్షణతో ఉద్యోగాలు – గ్రామీణ యువతకు ప్రాధాన్యత
సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి మాట్లాడుతూ 16 వేల మందికి శిక్షణ ఇచ్చిన సీడాప్, ఈ ఏడాది లక్ష్యం 60 వేలు అని చెప్పారు. ప్రస్తుతం 103 శిక్షణా కేంద్రాలు ఉన్నట్టు తెలిపారు. గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు లభించేలా ఎంటర్‌ప్రెన్యూర్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 40 బిజినెస్ యూనిట్లను గుర్తించగా, త్వరలోనే 300కి పెంచుతామని వెల్లడించారు. వ్యవస్థల పునఃఆకృతీకరణ, ప్రణాళికా పద్ధతిలో అమలు ఎంఎస్ఎంఇలను మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు అదనపు కమీషనర్ నియామకం అవసరమని, పాలసీల అమలులో సమన్వయం కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు ఎంఎస్ఎంఇ చైర్మన్ శివ శంకర్ తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్యంతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం
స్వర్ణాంధ్ర 2047 దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు శిక్షణా అవకాశాలు, ఉపాధి, పారిశ్రామిక రంగాల అభివృద్ధి వంటి అంశాల్లో సమగ్రమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ విధంగా, కూటమి ప్రభుత్వం నైతికతతో, వ్యవస్థబద్ధంగా యువత భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా సాగుతోంది.

Share this content:

Post Comment