జర్నలిస్టుల దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి కృషి

  • ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్

గుంటూరు, రాష్ట్రంలోని జర్నలిస్టుల దీర్ఘకాల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని శాసనమండలికి నూతనంగా ఎన్నికైన మాజీ మంత్రి, న్యాయవాది ఆలపాటి రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు. 1985 నుండి ఆలపాటితో సాన్నిహిత్యం కలిగిన సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు వారి స్వగృహంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా నిమ్మరాజు మాట్లాడుతూ.. గడిచిన నాలుగు దశాబ్దాలకు పైగా విద్యార్థి దశ నుంచి జర్నలిస్టులతో సాన్నిహిత్యం కలిగిన ఆలపాటికి తమ కష్టసుఖాలు, ఇతర బాధలు, సమస్యలు అన్నీ బాగా తెలుసన్నారు. అర్హులైన జర్నలిస్టులు అందరికీ తక్షణం అక్రెడిటేషన్ తో పాటు ప్రధానంగా ఇళ్ల స్థలాలు ఇవ్వటంపై దృష్టి సారించాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి 2014-19లో నాటి సీఎం చంద్రబాబు జారీ చేసిన జీవోలన్నీ గత ప్రభుత్వ హయాంలో బుట్టదాఖలా అయ్యాయన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో సరికొత్త జీవోలు వచ్చినా అడుగు ముందుకు పడలేదన్నారు. ఆలపాటి ప్రాతినిధ్యం వహించే పట్టభద్రుల నియోజకవర్గం ఆరు జిల్లాలు, 33 శాసనసభ నియోజకవర్గాలతో విస్తరించి వుందని, రాష్ట్రం మొత్తంపై అత్యధికంగా జర్నలిస్టులు ఈ నియోజకవర్గం పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారనేది మరువరాదని నిమ్మరాజు సూచించారు.

Share this content:

Post Comment