మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తా: అయితా బత్తుల ఆనందరావు
కోనసీమ జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజెపీ ఉమ్మడి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో మంగళ వారం మండలంలో నడిపూడి, పాలగుమ్మి గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన, టిడిపి, బిజెపి నాయకులు కార్యకర్తలు ఫాల్గొని విజయవంతం చేశారు. ప్రచారంలో అడుగడుగున జగన్ పాలన గురించి చెప్పుకొచ్చి డ్రైన్లు కరెంటు మంచినీరు సరిగా లేవని ప్రజలు ఆనందరావు దృష్టికి తీసుకువచ్చారు. మా పార్టీ తెలుగుదేశం రాగానే మీ అందరికీ కాలనీలలో డ్రెయిన్ లు,మంచినీరు కొరత రాకుండా అందుబాటులో తీసుకొస్తామని ఆనందరావు హామీ ఇచ్చారు, కొంతమంది మహిళలు ఇల్లు మధ్యలోనే నిలిచిపోయాయని, తమకు ఎటువంటి రుణాలు మంజూరు కాలేదని, దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. దాంతో ఆనందరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గృహ రుణాలు మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. ఇప్పటి వరకూ రాజధాని లేని రాష్ట్రంగా నిలిచిపోయిందని, టిడిపి అధికారంలోకి రాగానే అమరావతిని రాజధాని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెచ్చేటి చంద్రమౌళి, పెచ్చెట్టి విజయలక్ష్మి, బొర్రా ఈశ్వరరావు, చెరుకురి సాయిరాం, లింగోలు పండు. సుధా చిన్న . డాక్టర్ మానస అధికారి వెంకటలక్ష్మి, అధికారి బాబ్జి, కడియం సత్యనారాయణ, కుడుపూడి శీను, కుడుపూడి సూరిబాబు, గోసంగి శ్రీను, పెద్దిరెడ్డి రాము నల్లా వెంకటేశ్వరరావు, కుంపట్ల నాయుడు, అరిగెల మహేష్, నల్లా బ్రహ్మాజీ, తిక్కా సరస్వతి తదితరులు పాల్గొన్నారు.