ఇగోలను పక్కన పెట్టి ఎన్నికలు నిర్వహించాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి సుప్రీం కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఉందని, వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోందని, ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని, ఎన్నికలను నిర్వహించలేమని, పోలీసులకు కూడా వ్యాక్సిన్లు అందించాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం తన వాదనలో పేర్కొన్నది. దీనిపై సుప్రీ కోర్టు సీరియస్ అయ్యింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలోనే కేరళలో ఎన్నికలు జరిగాయని, మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగాయని, అక్కడి ప్రభుత్వాలు కరోనా కేసులు పెరగడానికి ఎన్నికలు ఒక సమస్య కాదని చెప్పినట్టు సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇగోలను పక్కన పెట్టి ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది.