ఎన్నికల కార్యాచరణ సమావేశం

కనిగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరికూటి నాగరాజు ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఎన్నికల సెంట్రల్ ఆంధ్ర కమిటీ సభ్యులు మాదాసు రమేష్ సీ.యస్.పురం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు అందుబాటులో లేని కారణంగా సీ యస్ పురం మండలంలో బూత్ స్థాయిలలో ఎలా పని చేయాలి. అదేవిధంగా మండలంలో ఎన్ని బూతులు ఉన్నాయి ఆ ఉన్న బూతులలో జనసేన పార్టీ ఎన్ని బూతులలో బలంగా ఉందో అని తెలుసుకొనుట కొరకు మరియు ఎలక్షన్ కమిషన్ కొత్త ఓటర్ల చేర్పుల గురించి వివరించేందుకు మరియు ఫారం 12-డి గురించి అంటే 85 సంవత్సరములు దాటిన వయోవృద్ధులు ఇంటి దగ్గరే ఓటు వేసుకుని అవకాశం గురించి వివరించుటకు గురువారం సీ యస్ పురంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసైనికులు ఉద్దేశించి మాట్లాడి వారికి దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉల్లిపాయల సుబ్బరాయుడు, సంగిశెట్టి శ్రీనివాస్, సంగిశెట్టి సాయి, పోర్ల రాంబాబు, కమతం రవి, సంగిశెట్టి సుబ్బారావు, సంగిశెట్టి మహేష్, సోమిశెట్టి రాము, సంగిశెట్టి వాసు పాల్గొన్నారు.