టేకులపల్లిలో మిరియాల రామకృష్ణ ఎన్నికల ప్రచారం

తెలంగాణ, ఖమ్మం, బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి మిరియాల రామకృష్ణ మంగళవారం టేకులపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ప్రజలకు అభివాదం చేస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.