55వ డివిజన్ లో సుజన చౌదరి ఎన్నికల ప్రచారం

పశ్చిమ నియోజకవర్గం: కంసల్ పేట 55వ డివిజన్ జనసేన, టిడిపి, బిజెపి పార్టీల ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్.డి.ఏ బలపరిచిన బిజెపి శాసనసభ అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరితో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ తూర్పు మరియు విజయవాడ పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు. ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి కృష్ణాజిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పశ్చిమ నియోజకవర్గం టిడిపి నాయకులు ఎం.ఎస్ బెగ్, జనసేన నాయకులు బాడిత శంకర్, జనసేన 55వ డివిజన్ అధ్యక్షులు పల్లంటి ఆది మరియు తెలుగుదేశం, బిజెపి పార్టీల డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.