పుంగనూరులో జనసేన – టీడీపిల ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు

పుంగనూరు నియోజకవర్గం: జనసేన – తెలుగుదేశం పార్టీలు ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు చేసారు. జనవరి 3 నుండీ పుంగనూరు మండల అన్ని పంచాయితీల పర్యటన చేయుటకు తెలుగుదేశం నియోజక వర్గ ఇంచార్జ్ రామచంద్ర రెడ్డి (చల్లా బాబు) ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసెన పార్టీ నియోజకర్గ ఇంచర్జ సి వి గంగాధర్ (చిన్నా రాయల్)తో కలసి జనసేన నాయకులు మండల అధ్యక్షులు పాముల హరి, ఎస్.సి సెల్ అధ్యక్షులు చంద్రబాబు, బీసీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్, మైనారిటీ అధ్యక్షులు కలేశా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మాధవ్ రెడ్డి, సీవి రెడ్డి, బాలాజీ, ప్రకాష్, గిరిబాబు, ప్రసాద్ ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.