మునమర్రు గ్రామ కమిటీ మరియు మండల కమిటీ సభ్యుల ఎన్నిక

పశ్చిమగోదావరి, పెనుగొండ మండలం, మునమర్రు గ్రామ జనసేనపార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెనుగొండ మండల అధ్యక్షులు కంబాల బాబులు అధ్యక్షతన, మునమర్రు గ్రామ కమిటీ మరియు మండల కమిటీ సభ్యుడి ఎంపిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మునమర్రు గ్రామ అధ్యక్షులుగా అడ్డగర్ల రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా తానేటి రవికుమార్ మరియు మండల కమిటీకి అడ్డగర్ల నరసింహమూర్తి లను మునమర్రు గ్రామ జనసేన పార్టీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, ఆమోదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంగళదాసు దానయ్య, షేక్ మహమ్మద్ అలీ, దార్లంక మారుతీ, అడ్డాల మధు, ధనరాజు, చిట్నూడి ధర్మరావు, మారిశెట్టి భార్గవ్, యడ్లపల్లి గంగాధర్, పోలనాటి మల్లికార్జునరావు, యగాటి నాని, తోట సురేంద్ర మరియు మునమర్రు గ్రామ జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గోనడం జరిగింది.