నీటి సరఫరాకున్న అంతరాన్ని తొలగించండి. ప్రజలు ఇబ్బంది పడని పరిస్థితిని నెలకొల్పండి: ఎంపీడీఓ ను కోరిన డా.యుగంధర్ పొన్న

కార్వేటినగరం మండలం, సురేంద్రనగర్ గ్రామపంచాయతీ, సురేంద్రనగరం హెచ్ డబ్ల్యు, ఏఏడబ్ల్యు, గ్రామానికి ఏర్పాటుచేసిన మంచినీటి సరఫరా మోటార్ స్టార్టర్ ను ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్రామం సరిహద్దు ఏర్పాటు చేయాలని, అవసరమైతే అప్పుడప్పుడు ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీరు ఇబ్బంది కరంగా ఉండటం వల్ల, బురద నీరు కూడా రావడం వల్ల ఒక కొత్త బోర్డు వేయాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మౌలిక వసతుల కల్పనలో అధికారులు ప్రజలకు అన్ని విధాలా సహకరించాలని, సత్వర చర్యలు చేపట్టి ప్రజారోగ్యంలో పెద్దన్న పాత్ర పోషించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. నీటి సరఫరాకు ఉన్న అంతరాన్ని తొలగించాలని, ప్రజలు ఇబ్బంది పడని పరిస్థితులు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవేంద్ర ఉన్నారు.