ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

ఏలూరు నియోజకవర్గ నూతన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్బంగా జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.. అనంతరం జనసేన పార్టీలోకి వైసీపీ టిడిపి ఇతర పార్టీల నుండి జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడవడానికి జనసేన పార్టీ లో 1,2,25 మరియు 44 వ డివిజన్ నుండి సుమారు 150 మంది జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు సమక్షంలో కండువా కప్పుకున్నారు.. అధికార పక్షం, ప్రతిపక్షం ఇద్దరు కుమ్మక్కై రాష్ట్రంలో ప్రజలకు ఉపాధి లేకుండా చేస్తున్నారు.. వారి పక్షాన నిలబడే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని గోవిందరావు విమర్శించారు.. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కీ అధికారం ఇవ్వడానికి అలాగే ఏలూరు నియోజకవర్గంలో జనసేన జెండా ఖచ్చితంగా ఎగురవేస్తామని ప్రజలు తమ పక్షాన ఉన్నారని తెలియజేశారు.. ఏలూరు నియోజకవర్గం లో జనసేన పార్టీ బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తున్న రెడ్డి అప్పల నాయుడు ను జిల్లా కార్యవర్గం ఘనంగా సత్కరించారు.. పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం తమ వంతు కృషి చేసిన ఏలూరు నగర కార్యవర్గానికి మరియు కార్యకర్తలను సన్మానించారు..ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ప్రజల పక్షాన ప్రతి సమస్యపై పోరాటం చేస్తామని సమస్య పరిష్కరించేంత వరకు వారికి అండగా నిలబడతామని రెడ్డి అప్పల నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథమహారధులకు, మెగా అభిమానులకు, బిజేపి నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు జనసేన పార్టీ కార్యకర్తలకు రెడ్డి అప్పల నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.. రానున్న రోజుల్లో మీ అందరికీ విధేయుడునై అంకిత భావంతో పనిచేస్తానని రెడ్డి అప్పల నాయుడు భరోసాను ఇచ్చారు..

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార చైర్మన్ మరియు నరసాపురం ఇంచార్జీ బొమ్మడి నాయకర్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి ముత్యాల రాజేష్, చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జి మేక ఈశ్వరయ్య, కైకలూరు ఇంచార్జీ బి.వి.రావు, ఉంగుటూరు నియోజకవర్గ ఇంచార్జి పత్సమట్ల ధర్మరాజు, తణుకు ఇంచార్జీ విడివాడ రామచంద్రరావు, ప్రముఖ వ్యాపారవేత్త రాఘవయ్య చౌదరి, మరియు జిల్లా ముఖ్య నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *