ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఏలూరు జనసేన ధర్నా

  • ప్రభుత్వంపై ధ్వజమెత్తిన జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి మరియు ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు

పెంచిన ఆర్టీసీ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జనసేనపార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి మరియు ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించి ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ… జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అప్పటి టిడిపి ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచుతుందని తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఛార్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని హామీ ఇచ్చారని అయితే నేడు చార్జీలను పెంచి అన్ని రకాల ప్రజలు సామాన్య, పేద, మధ్య తరగతి వారి, ప్రతి ఒక్క సామాన్యుడి నడ్డి విరిచారని రెడ్డి అప్పలనాయుడు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇంతేకాకుండా మూడు నెలల కాలంలో డీజిల్ ధర పెంపు సాకుతో ఆర్టీసీ ఛార్జీలను రెట్టింపు చేశారన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, కూరగాయలు, విద్యుత్, గ్యాస్ ధరలు తదితర ఛార్జీలు పెంపు సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపడమే అని అన్నారు. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని… లేనిపక్షంలో జనసేన పార్టీ పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, జిల్లా కార్యదర్శి కస్తూరి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, ఉపాధ్యక్షుడు బొత్స మధు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, కార్యనిర్వహక కార్యదర్శి గొడవర్తి నవీన్, కోశాధికారి పైడి లక్ష్మణరావు, నాయకులు ఇద్దుం చిరంజీవి, రావూరి దుర్గా మోహన్, బుద్ధా నాగేశ్వరరావు, వల్లూరి రమేష్, మురళి, పవన్, విజయ్, బొద్దాపు గోవింద్, మజ్జి హేమంత్, మజ్జి శ్రీను, సురేష్, వీర మహిళలు కావూరి వాణి, లంకా ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.