ఏమారాజు కోడపల్లి గ్రామంలో జనసేనలో భారీ చేరికలు

అల్లూరిసీతారామరాజు జిల్లా, జి.మాడుగుల మండలంలోని భీరం గ్రామ పంచాయితి, ఏమారాజు కోడపల్లి గ్రామం గతంలో వైసీపీ పార్టీకి కంచుకోట కానీ ప్రాంతంగా ఉన్నా.. నేడు జనసేన పార్టీ లోకి మూకుమ్మడిగా గ్రామస్తులు చేరడం జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్నిచ్చింది. ఏమారాజు కోడపల్లి గ్రామస్తులు జనసేన పార్టీలోకి మూకుమ్మడిగా చేరారు.. వివరాల్లోకి వెళ్తే తల్లే త్రిమూర్తి ఆధ్వర్యంలో ఏమారాజు కోడపల్లి గ్రామంలో జనసేన పార్టీ సమావేశం నిర్వహిస్తూ ముఖ్య అతిధిగా అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. గంగులయ్యను ఆహ్వానించారు. ఈ సందర్బంగా గంగులయ్య మాట్లాడుతూ రాజకీయాలు గిరిజన ప్రజలకు అస్తిత్వంతో సంబందముండే ప్రధాన హక్కు, సంక్షేమం, అభివృద్ధి సాధించాలంటే రాజ్యాధికారం నిజాయితీ, నీతి ఉన్న నాయకులు చేపట్టాలి గడిచిన 75 సంవత్సరాలు స్వాతంత్య్రం తర్వాత అనేక ఒడిదుడుకులకు గురైన అధివాసి ప్రాంతం నిత్యం సమస్యలతో సతమతమవుతూనే ఉంది గతంలో పాలించిన వివిధ రాజకీయపార్టీల నాయకులు బావప్రకటన స్వేచ్ఛని గౌరవంగా తమ హక్కుగా భావించి సక్రమంగా గిరిజన జాతికొరకు వినియోగించలేదు. అలా అని ప్రస్తుత నాయకులు కూడా తమ హక్కుని తాము ధైర్యంగా అడగలేకపోతున్నారు. అమాయక గిరిజనులమైన మనం కూడా చట్ట సభల్లోకి అటువంటి నాయకులని ఎంచుకోవడం మన దౌర్భాగ్యం. మైదాన ప్రాంతాలతో పోల్చి చూస్తే మనం ఎంత వెనకబాటులో ఉన్నామో మనకు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం 3 దశాబ్దాలుగా గిరిజన ప్రాంతాన్ని పాలించిన గత పార్టీల ప్రభుత్వాలే? నిజాయితీ గా పాలించినట్లైతే అంతో కొంతో అభివృద్ధిని చూసి వుండేవాళ్లము కానీ నేటి రాజకీయాలు విలువలు లోపించి, శవరాజకీయలతో కుళ్ళుమయిపోయిందని, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నమ్మడం గిరిజనులుగా మనం చేసిన పెద్ద పొరపాటని, వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మి రెండు ధపాలుగా ఈ ప్రాంతం నుంచి ఆదరించాము కానీ నేడు మన గిరిజన అస్తిత్వానికి చేటు తెచ్చి గిరిజన జాతిని నిర్వీర్యం చేయాలనే దురలోచనతో ఉన్నదని, ప్రస్తుత ప్రభుత్వం ని నమ్మినందుకు గిరిజన నిరుద్యోగులకు చాలా పెద్ద మోసమే చేసిందని జి.ఓ నెం 3, రద్దుచేస్తే పిల్ వెయ్యలేదు, జి.సి.సి నిర్వీర్యం చేసి రైతుల్ని మోసం చేసింది, ఆరోగ్య కార్యకర్తలను తొలగించి ఆశ్రమ పాఠశాల విద్యార్థుల చావుకు కారణమయ్యింది, ప్రతిభగలా విద్యార్థులను బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్ తొలగించి విద్యావ్యవస్తని నాశనం చేసింది. కులాల చిచ్చు పెట్టి ప్రభుత్వ సైట్స్ లో నుంచి కులాల తొలగింపు చేసింది. మొన్న 24.03 లో బోయావాల్మీకి, బెంతుఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేసి మన ఆస్తిత్వంపై దాడి చేసింది. ఇలా ఉంటే గతంలో పాలించిన ప్రతిపక్ష పార్టీ కూడా ఇదే తరహా మోసం చేసిందని, గిరిజన అభివృద్ధికి ఇప్పుడు మార్పుకోసం పాటుపడే రాజకీయాలు అవసరమని ఈ రెండు ప్రధాన పార్టీలు కూడా దారుణంగా మనల్ని వంచించింది కాబట్టి ప్రజలారా మనమంతా ఒక ఆలోచన చెయ్యాలి జనసేన పార్టీని ఆదరించాలన్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులందరు డా. గంగులయ్య చేతులతో జనసేన పార్టీ కండువా కప్పుకుని, జనసేన పార్టీలో చేరారు. ఇలా గ్రామస్తులందరు చేరడంతో జనసేన పార్టీ మండల నాయకులు ఆశ్చర్యాన్ని గురయ్యారు. ఇలా ఒక గ్రామం మొత్తం చేరడం ఎంతో సంతోషంగా ఉందని, మార్పు రావడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. కచ్చితంగా జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా మేమంతా పని చేస్తామని, గ్రామస్తులు తెలపడంతో డా. గంగులయ్య గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో జి.మాడుగుల మండల అధ్యక్షులు, భీమన్న, కార్యనిర్వహాక అధ్యక్షులు మసాడి సింహాచలం, తల్లే త్రీమూర్తులు, లీగల్ సెల్ ఇన్చార్జ్, కిల్లో రాజన్, టీవీ రమణ, సోమన్న, పండన్న, నాగేశ్వరరావు, భానుప్రసాద్ తదితరమండల నాయకులు గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.