*వాడపర్రులో కూటమి ప్రభుత్వ నేతల మనసున్న దాతృత్వం
ఉప్పలగుప్తం మండలం వాడపర్రు గ్రామంలో కొద్ది నెలల క్రితం ఓ వ్యక్తి మృతిచెందడంతో ఆయన పిల్లలు నిరాశ్రయులయ్యారు. ఈ విషాదాన్ని మద్దిoశెట్టి ప్రసాద్ ద్వారా తెలుసుకున్న సూరపురెడ్డి సురేష్, ఆకుల వెంకట రామారావు వారి పట్ల మానవత్వాన్ని చాటుతూ నెలకు సరిపడే నిత్యావసర వస్తువులను అందించారు. ఈ సహాయాన్ని కూటమి ప్రభుత్వ నేతల చేతుల మీదగా ఈరోజు కుటుంబానికి అందజేయడం జరిగింది. దాతల ఉదారతకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల అధ్యక్షుడు అరిగెల నానాజీ, నీటి సంఘం అధ్యక్షులు నల్లా సత్యనారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షుడు చీకట్ల ఏసు, జనసేన ఉపాధ్యక్షుడు మారిశెట్టి నాని, తుదగా పిల్లా వెంకటేశ్వరావు సహా జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఉదాత్తమైన సేవా కార్యక్రమం కూటమి నేతల సేవా తత్వానికి చిరునామా కావడం విశేషం.
Share this content:
Post Comment