ఎమర్జెన్సీ డే జిల్లా స్థాయి సెమినార్..

*ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్..

ఏలూరులోనీ డిసిఎంఎస్ కన్వెన్షన్ హాలులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన “చీకటి అధ్యాయానికి 50 సంవత్సరాలు” సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు వై. సత్య కుమార్ ని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తో కలిసి ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పుష్ప గుచ్చంతో ఘన స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి, పౌరుల ప్రాథమిక హక్కులను అణచివేయటమే లక్ష్యంగా ఆనాడు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. అటువంటి చీకటి రోజులు ప్రజాస్వామ్యంలో మరోసారి పునరావృతం కాకూడదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం ఎల్ ఏ అంబికా క్రిష్ణ, ఈడ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు ఏఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Share this content:

Post Comment