నా సేన కోసం నా వంతు కార్యక్రమం చేపట్టిన ఎమ్మిగనూరు జనసేన

ఎమ్మిగనూరు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నా సేన కోసం నా వంతు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు మండలం కందనాతి, కడివేళ్ళలో పర్యటించి పార్టీకి డోనేషన్ కార్యక్రమం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రాహుల్ సాగర్, కర్ణం రవి లు మాట్లాడుతూ క్రౌడ్ ఫండింగ్ లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కేవలం ఒక జనసేన పార్టీకే సాధ్యమని క్రౌడ్ ఫండింగ్ లాంటి కార్యక్రమంలో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు అయితేనేమి రాజకీయ కార్యక్రమాలు అయితేనేమి ఈప్రత్యేక కార్యక్రమంలో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాబోయే రోజుల్లో నా సేన నా కోసం వంతు నా కార్యక్రమాన్ని ప్రతి గ్రామ గ్రామానికి తీసుకుపోయే విధంగా కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రమేష్, రాముడు, మద్దిలేటి, నరేంద్ర, ధర్మ, రాజు, విష్ణు, కేశవ, రామకృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.