తిమిడిలో ఉపాధి హామీ సోషల్ అడిట్ గ్రామసభ

తిమిడిలో ఉపాధి హామీ సోషల్ ఆడిట్ గ్రామసభ విజయవంతంగా జరిగింది. ఈ గ్రామసభ బుధవారం మధ్యాహ్నం సచివాలయం కార్యదర్శి బంగారు నాయుడు ఆధ్వర్యంలో రామకోవెల వద్ద నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, జనసేన ఎస్.కోట నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు హాజరై ప్రసంగించారు. సన్యాసి నాయుడు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి కోసం ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా గ్రామస్థుల ఆదాయాలు పెరగడం ద్వారా వలసలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో చర్చించి, రాష్ట్రానికి అధిక నిధులను అందించి, రోడ్లు, భవనాలు మరియు ఇతర అభివృద్ధి పనులకు పునాదులు వేస్తున్నారని అన్నారు. ఈ పనులు పల్లె పండుగ పేరుతో గ్రామాలలో జరుగుతున్నాయని వివరించారు. గ్రామసభలో ప్రతాపదేవ్ చెరువు వద్ద పనులను ప్రారంభించి, గ్రామస్తులందరికీ రేపటి నుండి ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. సన్యాసి నాయుడు, ఏపీఓ అధికారిని కోరగా, వారు తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని తెలిపారు. సోషల్ ఆడిటర్ డి.ఆర్.పి సింహాచలం, సభలో మాట్లాడుతూ, మట్టి పనుల్లో ఎటువంటి అవినీతి జరిగినా, తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మేట్ పొరపాట్లు చేసినా, ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యత వహించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తిమిడిలో 72 రకాల పనులు పూర్తి చేయడానికి 70 లక్షల నిధులు కేటాయించబడినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ లలిత, ఫీల్డ్ అసిస్టెంట్ బాలరాజు, పలువురు మేట్లు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment